సీసీ కెమెరాలు పోలీసులకు సరైన సాటి
– గ్రామాల్లో శాంతిభధ్రతల పరిరక్షణలో కీలకం
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
– పెద్దేముల్ మండలంలో సీసీ కెమెరాల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీసీ కెమెరాలు వందమంది పోలీసుల తీరుకు సాటిగా నిలుస్తాయని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దేముల్ మండలం నాగుల పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, పెద్దేముల్ ఎస్ఐ గిరిలు ఎస్పీ నారాయణ రెడ్డికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ నారాయణ రెడ్డి పోలీసు అధికారులతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రించవచ్చన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని అన్నారు. నాగులపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అదేవిధంగా యువత అసాంఘీక కార్యాకలాపాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిసలై బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని అన్నారు. వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

