ఇందిరమ్మ ఇండ్ల సందడి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇందిరమ్మ ఇండ్ల సందడి..!
– ప్రొసిడింగ్లు పంపిణీ చేసిన నేతలు
– పేదల కలను నిజం చేస్తోందని హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల సందడి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రొసిడింగ్ లను మంజూరు చేసింది. ఈ ప్రొసిడింగ్ లను మంగళవారం తాండూరు పట్టణంలోని వార్డు వార్డులో నేతలు లబ్దిదారులకు పంపిణీ చేశారు.

పట్టణంలోని సాయిపూర్ 9వ వార్డులో కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప ముదిరాజ్ లబ్దిదారులకు ప్రొసిడింగ్ లను అందజేశారు. అదేవిధంగా 23వ వార్డులో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్, వార్డు ఇంచార్జ్, యువ నాయకులు భరత్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. అదేవిధంగా పట్టణంలోని 33వ వార్డులో మాజీ కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్ లు అర్హులకు ప్రొసిడింగ్ లను అందజేశారు. 6వ వార్డులో మాజీ కౌన్సిలర్ బోయరవి తన వార్డులోని లబ్దిదారులకు ప్రొసిడింగ్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేయూతను అందిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని అన్నారు. అర్హులైన లబ్దిదారులు ఇంటి నిర్మాణం చేపట్టి ఇందిరమ్మ చేయూతను సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నాయకులు వెంకట్రాములు, తాండ్ర రాకేష్, వార్డు ఆఫీసర్లు, ఆయా వార్డుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అనుమానాస్పద స్థితి మృతిలో ట్విస్ట్..!