బక్రీద్ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు

తాండూరు వికారాబాద్

బక్రీద్ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు
– డీఎస్పీ, చైర్ పర్సన్లకు విజ్ఞప్తులు
– ఈద్గా మైదానాన్ని పరిశీలించిన డీఎస్పీ శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బక్రీద్ పండుగకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని తాండూరు ముస్లిం సోదరులు కోరారు. సోమవారం తాండూరు డీఎస్పీ జి.శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్తలను కలిసి వినతిపత్రాలను అందజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ స్పందిస్తూ బల్దియా నుంచి అన్ని ఏర్పాట్లకు సహాకారం అందిస్తామన్నారు.

అదేవిధంగా తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ పట్టణంలోని చెన్ గేష్ పూర్ రోడ్డుమార్గంలో ఉన్న ఈద్గా మైదానాన్ని సందర్శించారు. అక్కడ ముస్లిం సోదరులు నిర్వహించే ప్రార్థనలు, ఇతర ఏర్పాట్లను అడిగితెలుసుకున్నారు. బక్రీద్ రోజు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరుపున భారీ బందో బస్తు ఉంటుందని ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటి చైర్మన్ యూసుఫ్ ఖాన్, మైనార్టీ నాయకులు ముస్తఫా తదితరులు ఉన్నారు. మరోవైపు తాండూరు ముస్లిం వెల్పేర్ సభ్యులు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్, డీఎస్పీలకు వినతిపత్రాలను అందజేశారు.