కల్వ సుజాతకు అభినందనల వెల్లువ..!
– శుభాకాంక్షలు తెలిపిన చైర్ పర్సన్, మాజీ చైర్ పర్సన్
– పాల్గొన్న తాండూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాతకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. శుక్రవారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య కార్పోరేషన్ కార్యాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు కల్వ సుజాతను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తాండూరు ఆర్యవైశ్య సంఢం, వాసవీ మహిళ సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కల్వ సుజాత కార్పోరేషన్ ద్వారా రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల అభ్యున్నతనికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, కోడూరి వినోద్, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, కోశాధికారి సింగంశెట్టి శోభ, మహిళ సభ్యులు, సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

