శభాష్ నవీన్ కుమార్..!
– గ్రూపు-4 మొదటి ప్రయత్నంలోనే జాబ్
– జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం
తాండూరు, దర్శిని ప్రతినిధి: నిరుపేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు గ్రూప్-4 మొదటి ప్రయత్నంలోనే జాబ్ కొట్టేశాడు. జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని ఎన్కెపల్లి గ్రామానికి చెందిన మాణిక్ రెడ్డి, విజయలక్ష్మీల కుమారుడు నవీన్ కుమార్ ఇటీవల గ్రూపు-4 రాశాడు. ఈ ఫలితాల్లో నవీన్ కుమార్ వైద్య విధాన పరిషత్ వికారాబాద్ జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించాడు. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన నవీన్ కుమార్ తన మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. నవీన్ కుమార్ ను పలువురు శభాష్ అంటూ అభినందించారు.
ఇదికూడా చదవండి…

