ఎంపీతో ఎమ్మెల్యే భేటి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎంపీతో ఎమ్మెల్యే భేటి..!
– రంజిత్ రెడ్డిని కలిసిన మనోహర్ రెడ్డి
– శుభాకాంక్షలు తాండూరు తెలిపిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీ రంజిత్ రెడ్డికి శాలువాతో సత్కరించి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, అబ్దుల్ రవూఫ్, సిద్రాల శ్రీనివాస్ తదితరులు కూడా ఎంపీ రంజిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!