అంబులెన్స్‌కు దారివ్వకుంటే అంతే సంగతులు..!

క్రైం జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

అంబులెన్స్‌కు దారివ్వకుంటే అంతే సంగతులు..!
– కారు డ్రైవర్‌కు భారీ పనిష్మెంట్
– వైరల్‌గా మారిన కేరళ పోలీసుల నిర్ణయం
దర్శిని డెస్క్ : రోడ్డు మీద అంబులెన్స్ వస్తుందంటే సామాన్య జనం మాత్రమే కాదు.. సెలబ్రిటీలు.. ప్రొటోకాల్ ఉన్న పొలిటిషన్స్ సైతం..తమ వాహనాలను సైడ్‌కి తీస్తుంటారు. అయితే కేరళలో కారులో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏం జరుగుతుంతో చూపించారు కేరళ పోలీసులు. అంబులెన్స్‌ను అడ్డుకున్న ఓ కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలో రద్దీగా ఉండే రోడ్డుపై కారు వెళ్తోంది. ఆ కారు వెంబడే అంబులెన్స్ వస్తుంది. అయితే, లోపల రోగి పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉండడంతో అంబులెన్స్ డ్రైవర్ వేగంగా నడుపుతున్నాడు. ఆ సమయంలో అంబులెన్స్ సైరన్ మోగిస్తానే ఉన్నాడు.

సదరు అంబులెన్స్ డ్రైవర్ కారును పక్కకు తప్పుకోవాలనే ఉద్దేశ్యంతోనే హారన్ కూడా మోగించడం మొదలుపెట్టాడు. అలా ఒకేసారి సైరన్, హారన్ మోగుతున్నా సదరు కారు డ్రైవర్ వారికి దరి ఇవ్వలేదు. దీంతో అంబులెన్సు ముందు భాగంలో కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్ ను కూడా విచారించిన పోలీసులు. వారు ఇచ్చిన సమాచారంతో కారును నడిపిన యజమాని ఇంటి వద్దకు వెళ్లి మరీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఏకంగా రెండున్నర లక్షల జరిమానా విధించారు.

మోటారు వాహనాల చట్టం ప్రకారం.. అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న వాహనాలకు దారి ఇవ్వాల్సిన కనీస బాధ్యత వాహనం నడిపే ప్రతి ఒక్కరి డ్రైవర్ పైనా ఉంటుంది. దీన్ని ఉల్లంఘించినందుకు గాను అతనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించి లైసెన్స్ కూడా రద్దు చేసారు. పోలీసుల చర్యపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 194E ప్రకారం.. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 10,000 లేదా జరిమానా, జైలు శిక్ష, కొన్ని పరిస్థితుల్లో రెండూ విధించవచ్చు.

ఇదికూడా చదవండి…

గ్రూఫ్-3కి హాఫ్ కంటే తక్కువ హాజరు..!