బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– రాజ్ కుమార్ విజ్ఞప్తి మేరకు సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి చొరవచూపుతామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ విజ్ఞప్తి మేరకు గురువారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పోలీస్టేషన్ వెనుకాల ఉన్న బీసీ స్మశాన వాటికను సందర్భించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ గత పదేళ్ల క్రితం స్మశాన వాటికను వైకుంఠదామంలో ఏర్పాటు చేయాలని నిధులు మంజూరు అయినా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. స్మశాన వాటికలో దారి లేక, పిచ్చి మొక్కలు పెరిగి కళాహీనంగా మారిందన్నారు. అంత్యక్రియల కోసం వచ్చిన వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందిస్తూ బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి చొరవచూపుతామన్నారు. మున్సిపల్ నుంచి స్మశాన వాటిక అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయించేలా చూస్తామన్నారు. బీసీ స్మశాన వాటికను వైకుంఠదామంగా మార్చి.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా చూస్తామని హామి ఇచ్చారు. దీనిపై కందుకూరి రాజ్ కుమార్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి.. హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు కరణం పురుషోత్తం, డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ డీపీసీ పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మిస్కన్ శంకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, భాస్కర్ రెడ్డి, చెంగోల్ రాము, బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

