నాగారం నర్సింలుకు నివాళులు..!
– పరామర్శించిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
– అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు, అభిమానులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ సీనీయర్ నేత, తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలుకు ఘన నివాళులు అర్పించారు. నాగారం నర్సింలు గుండెపోటుతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పట్టణంలోని నివాసానికి చేరుకుని నాగారం నర్సింలు ప్రార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరితో పాటు స్టేట్ ఫైనాన్స్ కవి షన్ మెంబర్ ఎం. రమేష్ మహరాజ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి ధారాసింగ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తాండూరు పట్టణ పురవీధుల్లో నాగారం నర్సింలు అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు నాయకులు, గంజ్ వ్యాపారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతిమ యాత్ర తరువాత భౌతిక ఖాయాన్ని నాగారం నర్సింలు స్వగ్రామం కోట్ పల్లి మండలం కొత్తపల్లికి తరలించారు. ఆయన స్వగ్రామంలోనే నాగారం నర్సింలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
ఇదికూడా చదవండి…

