తాండూరు మండలంలో పల్లె పల్లెకు పైలెట్
– ఈనెల 3నుంచి 6వ తేది వరకు కొనసాగింపు
– మండలంలోని గ్రామాల్లో పర్యటన తేదీలు ఖరారు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమం తాండూరు మండలంలో చేపట్టేందుకు ముహూర్తం ఖరారయ్యింది. మండలంలోని గ్రామాల్లో పర్యటించే తేదీలు నిర్ణయించారు. ఈనెల 3వ తేది నుంచి 6 వ తేది వరకు గ్రామాల్లో పర్యటన జరుగుతోందని ప్రకటన విడుదల చేశారు. ఈనెల 3న సంకిరెడ్డిపల్లి, సంకీ రెడ్డిపల్లి తాండా, జినుగుర్తి, సిరిగిరిపేట్, అల్లాపూర్, గౌతాపూర్, చెంగోల్, చితామణి పట్నం, పర్వతాపూర్, 4న ఓగీపూర్, కరణ్ కోట్, చంద్రవంచ, చిట్టిగణాపూర్, బెల్కటూర్, గోపన్ పల్లి, రాంపూర్, రాంపూర్ కింది తాండా, రాంపూర్ మీది తాండా, వీరారెడ్డిపల్లి, 5న కొల్లాపూర్, సంగం కలాన్, మల్కాపూర్, కోటబాస్పల్లి, ఐనెల్లి, మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, ఉద్దండాపూర్, గుండ్ల మడుగు తాండా, మైసమ్మ తాండా, 6వ నారాయణపూర్, గోనూర్ వీర్ శెట్టిపల్లి, బిజ్వార్, బొంకూరు, ఖాజాపూర్, అంతారం, దస్తగిరి పేట్, చెన్ గేష్ పూర్ కోనాపూర్, ఎల్మకన్నె గ్రామాల్లో పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ‘ అదేవిధంగా 7వ తేదిన మండల కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

