చెస్‌ ఆడదాం.. రండి..!

కెరీర్ క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

చెస్‌ ఆడదాం.. రండి..!
– వచ్చేనెల 15 నుంచి చెస్ పోటీలు
– ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆహ్వానం
– హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని విద్యార్థులతో చెస్‌ పోటీలు నిర్వహించేందుకు హిందూ ధార్మిక పరిషత్, తాండూరు ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ సిద్దమైంది. వచ్చే నెల డిసెంబర్ 15 నుంచి విద్యార్థులకు చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధార్మిక పరిషత్, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో భాష్యం జూనియర్ కాలేజీ, యాపిల్ కిడ్స్ ప్లేస్కూల్ సహాకారంతో చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 15 నుంచి 28వ తేది వరకు అండర్ 14, అండర్ 16 విభాగాలకు సంబంధించి పోటీలు జరుగుతాయన్నారు.

ప్రతి పాఠశాల నుంచి నలుగురు వి ద్యార్థులు తుది పోటీకి ఎంపిక అవుతారని తెలిపారు. పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంస పత్రాలు, మెమెంటోలు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ కన్వినర్ గాజుల బస్వరాజ్, సభ్యులు కరణం పురుషోత్తంరావు, నరేందర్, వేణుగొ పాల్ రెడ్డి, ఓంప్రకాష్ సోమాని, పటేల్ విజయ్ కుమార్, రమేష్, అలంపల్లి శ్రీనివాస్, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్వి మోహన్ గౌడ్, గౌరవాధ్యక్షులు అగ్గనూర్ కిరణ్ కుమార్, ప్రతినిధులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, అనురాధ రమేష్, పర్యాద కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మార్మోగిన శరణు గోస..!