హెల్త్ రేట్ పెంచే క్యారెట్..!
– శీతాకాలం తాగితే అద్భుత ప్రయోజనాలు
– నిద్రలేమి.. డయేరియాకు చెక్ పెట్టే ఔషదాలు
దర్శిని డెస్క్ : గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ఈ చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. శీతాకాలంలో క్యారెట్ హెల్త్ రేటును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక వ్యాధులను నయం చేస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటే శరీరానికి మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఇది శరీరంలోని వాపులను తగ్గించడంలో చాలా మేలు చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఇతర ఆహారాలు ఇందులో ఉన్నాయి. ఇది డయేరియాను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనలో రోగనిరోధక శక్తి పెరగాలన్నా మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు. క్యారెట్‌లో పొటాషియం, విటమిన్ సి మరియు విటమిన్ ఎ వంటి అనేక ముఖ్యమైన విటమిన్‌లతో నిండి ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడానికి క్యారెట్ జ్యూస్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ ముఖ సౌందర్యం కూడా పెరుగుతుంది. చర్మం మరింత నిగారింపు, మెరుపును పొందేలా చేస్తుంది. నిద్ర లేమితో బాధపడే వారికి క్యారెట్ జ్యూస్ ఒక చక్కని ముందు.
రోజు క్యారెట్ జ్యూస్ తీసుకోవటం వల్ల నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. అలాగే ఇది మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా పురుషుల్లో వీర్య వృద్ధిని పెంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. క్యారెట్ జ్యూస్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ప్రతిరోజూ దీనిని మీ ఆహారంలో చేర్చుకుంటే ముఖం శుభ్రంగా మారుతుంది. చర్మంలో డిఫరెంట్ గ్లో ఏర్పడుతుంది.
క్యారెట్ పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి అనేక ముఖ్యమైన విటమిన్‌లతో నిండివుంటుంది. ఇవి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి, కంటి చూపును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. పచ్చి క్యారెట్ రోజు తినడం వల్ల మీ దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులు నివారించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు క్యారెట్‌ను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఇదికూడా చదవండి…

