కొత్త మున్సిప‌ల్ భ‌వ‌నానికి కొంగొత్త శోభ‌

తాండూరు వికారాబాద్

పూజ‌లు చేసిన చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
– పాల్గొన్న పాలక‌వ‌ర్గ కౌన్సిల‌ర్లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ నూత‌న భ‌వ‌నంలో కొంగొత్త శోభ సంత‌రించుకుంది. గ‌త రెండేళ్లుగా పెండింగ్ ఉండిపోయిన భ‌వ‌నంలో శుక్ర‌వారం సాయంత్రం తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ పూజ‌లు నిర్వ‌హించారు. కొత్త భ‌వ‌నంలోని చైర్ ప‌ర్స‌న్ కార్యాల‌యంతో పాటు వివిధ కార్యాల‌యంలో చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ పాలక‌వ‌ర్గ కౌన్సిల‌ర్లతో క‌లిసి పూజ‌లు చేశారు. భ‌వ‌నాన్ని లాంచ‌నంగా ప్రారంభించ‌డంతో పాటు పూజ‌ల‌తో మున్సిప‌ల్
భ‌వ‌నం సంద‌డి సంద‌డిగా మారింది. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు అబ్దుల్ ర‌జాక్, స‌ల్మా పాతిమా, ముక్తార్ నాజ్, ఎంఐఎం ఫ్లోర్ లీడ‌ర్ సాజిద్అలీ, బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్ సింధూజ‌గౌడ్, కౌన్సిల‌ర్లు బంటారం లావ‌ణ్య‌, బొంబీనా, మున్సిప‌ల్ కోఆఫ్ష‌న్ స‌భ్యురాలు బిర్క‌ట్ ఉశ‌, మాజీ కౌన్సిల‌ర్ జుబేర్ లాల‌, మున్సిప‌ల్ ఆర్పీలు త‌దిత‌రులు పాల్గొన్నారు.