వీరశైవ సమాజం అభివృద్దికి తోడ్పాటు
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– రుద్రభూమిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
తాండూరు, దర్శినిప్రతినిధి: తాండూరు వీరశైవ సమాజం అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. గురువారం వీరశైవ సమాజంకు చెందిన రుద్రభూమిలో సీసీ రోడ్డు పనులు చేపట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, కౌన్సిలర్ బోయ రవిలతో కలిసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వీరశైవ సమాజానికి ఎంతో చేయూతనందించారని అన్నారు. రుద్రభూమిలో సీసీ రోడ్డు నిర్మాణానికి కూడ సహాకారం అందించారన్నారు. మహేందర్ రెడ్డి స్పూర్తితో వీరశైవ సమాజానికి అంచెలంచెలుగా సహాకారం అందించి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. అదేవిధంగా సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల సహాకారంతో రుద్రభూమి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజం ప్రధాన కార్యదర్శి గాజుల శాంతుకుమార్, గౌరవాధ్యక్షులు తంబాకు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గూలీ పరమేశ్వర్ స్వామి, పటేల్ విజయ్ కుమార్, ప్రకాష్, నాగభూషణం, బీదర్ రాజశేఖర్, వీరశైవ యువదళ్ ఉపాధ్యక్షులు శివానంద్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

