ఈ చైన్ స్నాచర్ ఖతర్నాక్..!

క్రైం టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

ఈ చైన్ స్నాచర్ ఖతర్నాక్..!
– టైం చూసి చోరీలకు ప్లాన్
– తప్పించుకునేందుకు వెంట అస్త్రాలు
– ఆటకట్టించిన వికారాబాద్‌ పోలీసులు

– కటకటాల్లోకి అంతర్‌రాష్ట్ర దొంగలు
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని పక్కా స్కెచ్ వేసి చైన్‌ స్నాచింగ్‌ చేయడంలో దిట్ట. ఒకవేళ దొరికితే తప్పించుకునేందుకు అన్ని పెప్పర్ స్ప్రే.. కత్తితో దాడి చేసేందుకు ప్రిపేర్ అవుతాడు. ఈ ఖతర్నాక్ దొంగపై కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కేసులు నమోదయ్యాయి. ఈ అంతర్ రాష్ట్ర దొంగతో పాటు సహాయకుడుగా వచ్చిన మైనర్ బాలున్ని వికారాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను మంగళవారం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఈనెల 22న వికారాబాద్‌ జిల్లా బొంరాస్ పేట్, వికారాబాద్‌ పోలీస్టేషన్‌లో పరిధిలో మహిళల నుంచి చైన్ స్నానింగ్ ఘటనలు జరిగాయి. అదేరోజు కుల్కచర్లలో చైన్ స్నానింగ్‌కు యత్నించగా విఫలయత్నం అయ్యింది. ఈ ఘటనల్లో ఆయా పోలీస్టేషన్‌లలో బాధితులు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల్లోనే 3 కేసులు నమోదు కావడంతో పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీపుటేజీల ఆధారంగా చోరీలకు పాల్పడింది కర్ణాటక రాష్ట్రంకు చెందిన ఎండీ జావిద్‌గా గుర్తించారు. అతనితో పాటు ఓ మైనర్‌ బాలుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో బీధర్ జిల్లా, హుంనాబాద్ తాలూకా లోని తేజస్ లాడ్జ్ వద్ద వికారాబాద్ సి‌సి‌ఎస్ పోలీస్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ సమయంలోనే చోరీలకు ప్లాన్
నిందితుడు జావిద్ చోరీలు చేసేందుకు ప్రత్యేక మైన శైలిని అవలంభిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తనతో పరిచయం ఉన్న ఆరిఫ్, మేరాజ్, అర్షాద్, రశీద్ పటేల్, ఆఫ్రోజ్, వజీద్, సమీర్, రవూఫ్, అర్బస్ లలో ఎవరినైనా ఒకరిని తోడుగా తీసుకొని వచ్చి నేరాలకు పాల్పడుతాడు. ఒంటరిగా వాకింగ్ చేసే మహిళలు, ఆరుబయట కూర్చున్న మహిళలను, కిరాణా కొట్టులలో ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకుంటారు. వీరిలో ఒక నేరస్తుడు బైక్ నడిపిస్తాడు ఇంకొక నేరస్తుడు వెనకాల కూర్చొని మహిళల మెడలో ఉన్న బంగారం గొలుసులను స్నాచింగ్ చేసుకొని పారిపోతారు.

ఎవరైనా వారిని ఎదిరిస్తే వారి కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టి, వేట కొడవలితో బయపెట్టి పారిపోతారు. ఇట్టి నేరస్తులు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే దొంగతనాలకు పాల్పడుతారు. ఆదివారం రోజున ఎలాంటి నేరాలకు పాల్పడరు.

ఇలా తప్పించుకుంటారు..
నేరస్థులు నేరాలకు పాల్పడిన తర్వాత చాలా చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటారు. ఇన్ని నేరాలకు పాల్పడి కూడా కేవలం రెండు సార్లు (ఇది రెండవ సారి ) మాత్రమే పోలీసులకు చిక్కినారు. నేరస్తుడు నేరం చేసిన వెంటనే పోలీసులకు చిక్కకుండా వెంటనే తాము వాడిన బైక్ యొక్క నెంబర్ ప్లేట్ మరియు తాము వేసుకున్న బట్టలను మార్చేస్తారు. టెక్నికల్ గా కూడా పోలీస్ లకు చిక్కకుండా నిందితులు ఎప్పటికప్పుడు తన సెల్ ఫోన్ లు, సిమ్ కార్డ్స్ మార్చుకుంటూ, తమ సెల్ ఫోన్ నుండి ఎవరికి కూడా డైరెక్ట్ గా కాల్స్ చేయకుండా జాగ్రత్తపడుతారు. దారిన పోయే అమాయకులతో మంచిగా మాట్లాడుతూ వారి మొబైల్ ఫోన్ తీసుకొని వారి ఫోన్ నెంబర్ తో నేరస్థులు తమ సెల్ ఫోన్ లో Whatsapp ఏర్పాటు చేసుకొని వాడుతారు.

తమ సెల్ ఫోన్ లోని ఇంటర్నెట్ తో కాకుండా తమ ఇతర మొబైల్ లోని హాట్ స్పాట్ తో వీళ్ళు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని వాడుతారు. మరియు నేరాలు చేయడానికి వచ్చే ముందు 100 కిలోమీటర్స్ దూరంగా ఉన్నప్పుడే తమ సెల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసుకొని వచ్చి, నేరం చేసిన తర్వాత తిరిగి 100 కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయి తమ సెల్ ఫోన్ లను నేరస్థులు స్విచ్ ఆన్ చేసుకుంటారు.

జైలుకెళ్లినా మారని బుద్ది..
2020 సంవత్సరం లో నిందితుడు ఎండీ జావిద్ చర్లపల్లి జైలు(జుడిసియల్ కస్టడీ )లో ఉన్నపుడు కరోన బారిన పడ్డాడు. గాంధీ హాస్పిటల్ చికిత్స అందిస్తుండగా అక్కడి ఎస్కార్ట్ పోలీస్ సిబ్బంది కండ్లు కప్పి, పోలీసులకు చిక్కకుండా అక్కడి నుండి పారిపోయాడు. అప్పట్లో చిలకల గూడ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి పట్టుకొని రిమాండ్ చేయగా జైలుకు వెళ్లాడు. అప్పటి నుండి జైలులో ఉండి 2022 నవంబర్ లో 2nd Addl.dist.and సెషన్స్ జడ్జ్ , బిధర్ (సిట్టింగ్ at బసవకళ్యాన్) కోర్ట్ నుండి బెయిల్ తీసుకొని బయటకి రావడం జరిగింది. మళ్ళీ కోర్ట్ కు వెళ్ళాక పోవడం తో అట్టి కోర్ట్ లో NBW పెండింగ్ లో ఉంది. నిందితుని పైన కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ మరియు రంగారెడ్డి జిల్లాలలో మొత్తం కలిపి సుమారు 150 కేసులు నమోదై ఉన్నాయి.

ఆబరణాల రికవరీ, కత్తి స్వాదీనం
వికారాబాద్ పి‌ఎస్ లో నమోదు అయిన కేసులలో 2.5 తులాల గోల్డ్ చైన్, సదాశివపేట్ పి‌ఎస్ పరిధిలోని కేసులో 4 తులాల గోల్డ్ చైన్, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కేసులోని 3.5 తులాల గోల్డ్ చైన్ లను మొత్తం సుమారు రూ. 7,80,000ల విలువైన 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరస్తుల నుండి రెండు పెప్పర్ స్ప్రేలు, వేటకొడవలిలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. పై కేసులను ఛేదించిన పోలీసు అధికారులు సి‌సి‌ఎస్ ఇన్స్పెక్టర్లు బలవంతయ్య, అన్వర్ పాషా, HCs చెన్నయ్య గౌడ్, జయవర్ధన్, శివకుమార్, PCs క్రిష్ణ రెడ్డి, రాఘవేంధర్ రెడ్డి, అంజప్ప, రామకృష్ణలను జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అభినందించారు. వారికి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఇదికూడా చదవండి…

శాసన సభను దాసోహం చేస్తారా..!