రాగి ఖర్జూర జావా ఆరోగ్యానికి ధీమా..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

రాగి ఖర్జూర జావా ఆరోగ్యానికి ధీమా..!
– వేసవిలో ఉపశమనం, తక్షణ శక్తి
– ఆరోగ్య సమస్యలు తరిమి మేలు
– షుగర్‌ పేషంట్లకు బెస్ట్‌ ఫుడ్
దర్శిని డెస్క్: రాగి ఖర్జూర జావా.. ఆరోగ్యానికి ఎంతో ధీమాను అందిస్తుందని వైద్యులు, ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. పూర్వకాలంలో విరివిగా వాడే ఆహారపు అలవాట్లలో రాగి జావ ఒకటి. అందులోని మేలు, ఉపయోగాలను గుర్తించి ప్రస్తుతం సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ రాగులు ఆహారంగా తీసుకుంటున్నారు. రాగులలో
ఉండే కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలతో పాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి పోషాలు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో పాటు ఎముకల ధృత్వానికి, రక్తహీనత సమస్యలకు చెక్‌ పెడతాయి కూడా. ఈ రాగులను ఏ విధంగా ఆహారంగా తీసుకున్నా అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.

అందుకనే రాగులను రాగి ఇడ్లి, రాగి దోశ, రాగి ఊతప్పం వంటి టిఫిన్స్ తో పాటు.. జావ వంటి వాటిని కూడా తయారు చేసుకుని తీసుకుంటుంటారు. అయితే కొందరికి రాగుల టేస్ట్ బాగాలేదంటూ తీసుకునేందుకు దూరంగా ఉంటారు. పిల్లలు, పెద్దలు ఇష్టంగా రాగి జావను తాగేలా రాగులను ఖ‌ర్జూరం, పాలతో కలిపి త జావ‌ను తయారు చేసి ఇవ్వండి. ఇందులోని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు పంచండి. రాగి ఖ‌ర్జూరం జావ‌ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: రాగి పిండి – అర కప్పు, పాలు – ఒక కప్పు, ఖర్జురాలు – 8 నుంచి 10, యాలకుల పొడి – కొంచెం, నీరు – 1/4 లీటరు, డ్రై ఫ్రూట్స్ – అప్షనల్.

ఎలా రెడి చేయాలంటే
ముందుగా గింజలు తీసి ఉంచున్న ఖర్జురంలను, అరకప్పు పాలు, సిద్దం చేసుకోవాలి. ఆ తర్వాత వెలిగించిన స్టవ్‌ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులో అర కప్పు పాలు పోసుకుని గింజలు తీసుకున్న ఖ‌ర్జూరాల‌ను వేసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసుకుని చల్లారబెట్టుకోవాలి.

అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నెను తీసుకుని రాగిపిండి, కొంచెం నీరు పోసుకుని.. ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత తీసుకుని నీరు మొత్తాన్ని పోసుకుని స్టవ్ మీద పెట్టి.. దగ్గరగా వచ్చే వరకూ ఉడికించండి. రాగి పిండి ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న ఖర్జూరం పలు పేస్ట్ వేసుకుని , మిగిలిన పాలు వేసి కలుపుకోవాలి. ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. మరికొంచెం సేపు రాగి ఖర్జూరం ఉడికించి స్టవ్ ఆపి పక్కకు పెట్టుకోవాలి. అంతే రాగి ఖ‌ర్జూరం జావ రెడీ.