శాసన సభను దాసోహం చేస్తారా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శాసన సభను దాసోహం చేస్తారా..!
– తెలుగు మాట్లాడాలంటే ఓవైసి పర్మీషన్ ఎందుకు
– సీఎం రేవంత్ రెడ్డి తీరు సిగ్గుచేటు
– వెంటనే సీఎం క్షమాపణ చెప్పాలి
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేశ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ శాసన సభను, తెలంగాణ ప్రజలను ఎంఐఎం పార్టీ నేత ముందు దాసోహారం చేస్తారా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడేందుకు ఎమ్యేల్యే అక్బరుద్దీన్ అనుమతి కోరడాన్ని ఖండించారు. మంగళవారం రమేష్‌ కుమార్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ శాసన సభలో ఎ సభ్యుడు మాట్లాడినా తెలుగులోనే మాట్లాడతారని, సోమవారం జరిగిన శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి హిందీలో మాట్లాడుతూ తెలుగులో మాట్లాడేందుకు ఓవైసిని పర్మీషన్ అడగడంను వ్యతిరేకించారు. ఈ తీరు చూస్తుంటే తెలంగాణ శాసన సభను, తెలంగాణ ప్రజలను మొత్తం ఎంఐఎం కాళ్ల దగ్గర మోకరిల్లేలా చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

సభా మర్యాదలను విస్మరించి, దళిత నాయకుడు స్పీకర్ ఉన్నారన్న సోయి లేకుండా, స్పీకర్ కుర్చీనే అవమాన పరిచే విధంగా చేశారని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆ కుర్చిలో కూర్చునే అర్హత రేవంత్ రెడ్డి కోల్పోయాడని ద్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం స్టీరింగ్ తమ చెతుల్లో ఉందని ఓవైసి చెప్పినప్పుడు అప్పటి పార్టీ గానీ, కేసిఆర్ ఆయన ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఖండించలేదని విమర్శించారు. పైపెచ్చు ఒవైసీల కనుసన్నల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచినట్టు పాలన సాగిందన్నారు. ఇప్పుడు నడుస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎం కనుసన్నల్లో నే నడుస్తుంది అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని అన్నారు. సభలోనే ఓవైసీలకు అంత భయపడితే భయట ఇంకెంత మోకరిల్లు తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నారు. కేసిఆర్ ప్రభుత్వం ఓవైసీలకు దోచి పెట్టినట్టు గానే రేవంత్ ప్రభుత్వం దోచి పెడుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు, శాసన సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

ఏసీబీ ట్రాప్.. అంతా సస్పెన్స్‌..!