శబరిగిరీషుని చెంత తాండూరు స్వాములు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శబరిగిరీషుని చెంత తాండూరు స్వాములు..!
– భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి దర్శనం
– 22వ ఏడాది దర్శించుకున్న పటేల్ కిరణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : శబరిమల క్షేత్రంలో తాండూరు అయ్యప్ప స్వాములు స్వామి దర్శనార్థం తరలివెళ్లారు. సోమవారం అయ్యప్ప స్వామిని కనులారా దర్శించుకున్నారు. తాండూరు నుంచి భద్రేశ్వర దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ స్వామి మాలలో ఇరుముడి ఎత్తుకుని తరలివెళ్లారు. ఈ యేడాదితో 22వ సారి అయ్యప్ప స్వామిని ఆయన దరి ్శంచుకున్నారు. పటేల్ కిరణ్ కుమార్ తో పాటు తాండూరుకు చెందిన రంగంపల్లి గోవింద్ స్వామి: బంకుల విష్ణువర్ధన్, గురుస్వామి సందీప్ గౌడ్, జన్ని, కిరణ్ గౌడ్ తదితరులు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

ఇదికూడా చదవండి…

ఆక్రమిత కలుపు మొక్కలతో జీవ వైవిద్యంకు నష్టం