పాహిమాం.. శాకాంబరీ మాత..!
– నెహ్రుగంజ్ ఎల్లమ్మకు ప్రత్యేక అలంకరణ
– పూజలు నిర్వహించి దర్శించుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాహిమాం.. శాకాంబరీ మాతా అంటూ భక్తులు రేణుకా ఎల్లమ్మను వేడుకున్నారు. ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లో వెలసిన రేణుకా నాగ ఎల్లమ్మను శాకాంబరీ మాతగా అలంకరణ చేశారు. ఆకు కూరలు, కూరగాయలతో చేసిన అలంకరణలో అమ్మవార్లు ప్రత్యేక దర్శనం ఇచ్చారు. శాకాంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని ఆయా దేవాలయాలలో వెలసిన అమ్మవార్లను ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. పాహిమాం.. తల్లీ, శాకాంబరీ నమోస్తుతే.. అంటూ అమ్మవారికి పూజలు నిర్వహించారు. దీంతో శాకాంబరీ ఉత్సవాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఇదికూడా చదవండి…

