ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాలు..!
– పది, ఇంటర్ అర్హత చాలు
– సొంత జిల్లాలో పనిచేసుకునేందుకు అవకాశం
దర్శిని డెస్క్ : దేశంలోని సామన్య పౌరులతో పాటు వృద్ధులు, చిన్నారులందరికి ఆధార్ కార్డు అవసరం. అందరికి ఆధార్ కార్డు నమోదు సేవలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ నుంచి తెంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఆధార్ సేవా కేంద్రాలలో పనిచేసేందుకు గాను ఆధార్ ఆపరేటర్, ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటీఫికేషన్ జారీ చేసింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. పై అర్హతల తో పాటు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్. పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏ జిల్లాలలో ఖాళీలు వున్నాయో ఆ జిల్లాకు చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికెట్ మరియు రెస్యూమ్ లను అప్లోడ్ చేయవలసి వుంటుంది. తెలంగాణా అభ్యర్థులు తేది: 28/02/2025 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణా లో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
అదిలాబాద్ – 01
కరీంనగర్ – 01
భద్రాద్రి కొత్తగూడెం – 01
మహబూబాబాద్ – 01
మహబూబ్ నగర్ – 01
మెదక్ – 01
మూలుగు – 01
నల్గొండ – 01
నారాయణ పేట – 01
నిర్మల్ – 01
నిజామాబాద్ – 01
పెద్ద పల్లి – 01
రంగా రెడ్డి – 01
వికారాబాద్ – 01
వనపర్తి – 01
యాదాద్రి భువనగిరి – 01
దరఖాస్తుల కోసం కింద లింకులను ఓపెన్ చేయండి..
https://cscspv.in/ask-job.html
https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action
ఇదికూడా చదవండి…

