ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందే..!
– 42 శాతానికి పెంచి ఎన్నికలు నిర్వహించాలి
– కామారెడ్డి డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచి తీరాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42శాతంకు పెంచుతామని మెనిఫెస్టో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ మేరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమోదించిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషనన్ను ఎట్టి పరిస్థితిలోను అమలు చేయాలన్నారు. లేదంటే ఎన్నికలలో బీసీల గుణపాఠం తప్పదన్నారు.

ఇది కూడా చదవండి….

తంగేడులో… ఔషధాలు బోలెడు..!