“తొలిమెట్టు” అమలు భేష్!
– విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందెలా బోధన
– వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి
– కాచారం పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ధారూరు మండలంలోని కాచారం ప్రాథమిక పాఠశాలలో “తొలిమెట్టు”(ఎఫ్ఎల్ఎన్) భేషుగ్గా అమలు చేస్తున్నారని వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి కొనియాడారు. ఈ మేరకు గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివాణితో ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడారు. విద్యార్థులకు సులబంగా పాఠాలు అర్థమయ్యేలా, వారిలో నైపుణ్యం పెంచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేయడాన్ని అభినందించారు. వీడియో కాల్ చేసి విద్యార్థులతో సునీతారెడ్డి మాట్లాడారు. టీ ఎల్ ఎం పద్దతిలో చెప్పే విద్యాబోధన తమకు పాఠాలు బాగా అర్థం అవుతున్నాయని విద్యార్థులు సునీతారెడ్డి కి తెలిపారు.
ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయాలని సూచించారు. మొదటి, రెండు తరగతుల విద్యార్థులు కూడా ఇంగ్లీషు భాషలో మాట్లాడడం పై సునీతారెడ్డి ముగ్దురాలయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన లభిస్తుంధనడానికి కాచారం పాఠశాలనే నిదర్శనమన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయురాలు శివాణిని, ఉపాధ్యాయురాలు అనురాధను ప్రత్యేకంగా అభినందించారు.
ఇదికూడా చదవండి…

