బాలల సంరక్షణకు కృషి చేయాలి
– మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: సమాజంలో అక్రమాలకు, అఘాయిత్యాలకు గురవుతున్న బాలల సంరక్షణకు అందరు కృషి చేయాలని తాండూరు మున్సిపల్ టీఆర్ఎస్ సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం సాయిపూర్లోని తులసీ గార్డెన్లో చైల్డ్‌లైన్ 1098 తాండూరు సబ్ సెంటర్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్
కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కౌన్సిలర్ నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. చదువుకు దూరం కావడం, చిన్నతనంలో బాల్యవివాహాలు చేయడం, అక్రమ రవాణాలతో పాటు అఘాయిత్యాలకు పాల్పడడం జరుగుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అందరు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ఎవరైనా ఎదైన సమస్యలో ఉంటే చైల్డ్ లైన్ 1098ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ 1098 తాండూరు కోఆర్డీనేటర్ వై.వెంకటేష్, అంగన్వాడి టీచర్లు పద్మావతి, స్వాతి, కల్పన, నవీన, ఎఎన్ఎం మల్లమ్మ, ఆశ వర్కర్ సవిత, చైల్డ్ లైన్ సిబ్బంది నర్సింలు గౌడ్, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.


