ఊడిన ఉపసర్పంచ్ పదవి..!
– చంద్రవంచలో నెగ్గిన అవిశ్వాసం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఉపసర్పంచ్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో వార్డు సభ్యులు అమోదించడంతో ఆయన పదవిని కోల్పోయారు. వివరాల్లోకి వెళితే తాండూరు మండలం చంద్రవంచ గ్రామ ఉపసర్పంచ్ బోయిని రామప్పపై గ్రామ వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో భాగంగా గురువారం తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేశారు.
ఆర్డీఓ సమక్షంలో ఉపసర్పంచ్ బోయిని రాములుకు వ్యతిరేకంగా 7మంది వార్డు సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తి ఆమోదించడంతో అవిశ్వాసం నెగ్గింది. దీంతో గ్రామ ఉపసర్పచ్ రాములు తన పదవిని కోల్పోయారు. ఈ విషయాన్ని ఆర్డీఓ అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహేష్ గారు, మండల పంచాయతీ అధికారి రతన్ సింగ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
