క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహాకారం
– టోర్నమెంట్లతో క్రీడాకారుల్లో నైపుణ్యం మెరుగు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ కు స్పందన అభినందనీయం
– తాండూరులో ముగిసిన టోర్నమెంట్
– విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహాకారం అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఈనెల 8న తాండూరు పట్టణ శివారు గౌతమీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే బీఎంఆర్ క్రీడా టోర్నమెంట్ శనివారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు జరిగిన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్ పోటీలలో గెలిచిన విజేతలకు ఎమ్మెల్యే తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల్లో నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు టోర్నమెంట్ లు దోహదపడతాయన్నారు.
క్రీడా పోటీల వల్ల విద్యార్థులలో స్నేహపూరిత వాతావరణం, పోటీ తత్వం, క్రమశిక్షణ మెరుగు పడతాన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములను సహజంగా తీసుకోవాలన్నారు. తాండూరు నియోజకవర్గంలో క్రీడలతో పాటు క్రీడాకారుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామన్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ టోర్నమెంట్ లో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పరంగా 50 పాఠశాలల నుంచి 191టీములు వారిగా 2100 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరమన్నారు. టోర్నమెంట్ ను విజయవంతం చేసిన నిర్వహకులందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, ప్రచార కోఆర్డినేటర్ కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి. కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్యక్షురాలు శోభారాణి, గాజుల మాధవి, నాయకులు మహిపాల్ రెడ్డి, లొంక నర్సింలు, అజయ్ ప్రసాద్, తాండూరు రూరల్ సీఐ వై.నగేష్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
MLA BMR CUP-2025 టోర్నమెంట్ విజేతలు
వాలీబాల్ విజేతలు
మొదటి బహుమతి: బషీరాబాద్ ZPHS
రెండవ బహుమతి: మంబాపూర్ ZPHS
మూడవ బహుమతి: ZPHS మల్కాపూర్
త్రోబాల్ విజేతలు
మొదటి బహుమతి: గంగోత్రి స్కూల్, తాండూరు పట్టణం
రెండవ బహుమతి: మారుతి స్కూల్, తాండూరు
మూడవ బహుమతి: గౌతమి మోడల్ స్కూల్, తాండూరు పట్టణం
కబడ్డీ విజేతలు (బాలికలు)
మొదటి బహుమతి:ZPHS యాలాల్
రెండవ బహుమతి:గౌతమి మోడల్ స్కూల్, తాండూరు పట్టణం
మూడవ బహుమతి: ZPHS అగ్గనూర్
కబడ్డీ విజేతలు (బాలురు)
మొదటి బహుమతి: గౌతమి మోడల్ స్కూల్, తాండూరు పట్టణం
రెండవ బహుమతి: ZPHS పగిడ్యాల్
మూడవ బహుమతి:ZPHS మంబాపూర్
ఖోఖో విజేతలు (బాలురు)
మొదటి బహుమతి: గౌతమి మోడల్ స్కూల్, తాండూరు పట్టణం
రెండవ బహుమతి: అక్షర కాన్సెప్ట్స్ స్కూల్, తాండూరు పట్టణం
మూడవ బహుమతి: నలంద స్కూల్, తాండూరు పట్టణం
ఖోఖో విజేతలు (బాలికలు)
మొదటి బహుమతి: ZPHS అగ్గనూర్
రెండవ బహుమతి: కృష్ణవేణి కాన్సెప్ట్స్ స్కూల్, తాండూరు పట్టణం
మూడవ బహుమతి: సెయింట్ మార్క్ స్కూల్, తాండూరు పట్టణం
ఇది కూడా చదవండి….

