పేదల సొంతింటి కలకు తోడ్పాటు
– అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు
– త్వరలోనే డబుల్ బెడ్ రూంల పంపిణీకి కృషి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం సమద్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల కమిటి సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఆయన చేతుల మీదుగా ప్రోసిడింగ్ లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంత ఇంటి నిర్మాణం కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారిస్తోందని అన్నారు. స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిధులు మంజూరు చేస్తోందని అన్నారు. తాండూరు పట్టణంలో మొదటి దశలో 450 ఇండ్లు మంజూరయ్యాయని, రెండో దశలో మరిన్ని ఇండ్లను మంజూరు చేయించేలా చూస్తామన్నారు.

దీంతో పాటు తాండూరు పట్టణంలోని పేదలకు త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కమీషనర్ యాదగిరి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదళి రవికుమార్, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, బోయరాజు, నాయకులు సర్దార్ ఖాన్, వడ్డె శ్రీనివాస్, హబీబ్ లాల, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

