14న మకరజ్యోతి దర్శనం
– అయ్యప్ప మహా పడిపూజ
– మేఘనాథ్ గౌడ్ సహాకారంతో ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎల్లుండి మంగళవారం అయ్యప్ప మహా పడిపూజ, మకరజ్యోతి దర్శనం ఉంటుందని ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. ప్రతియేడాది మాదిరిగానే సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆలయంలో మకర జ్యోతి దర్శనంకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. తాండూరు మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు, సంగెం కలాన్ మాజీ సర్పంచ్, గీతా కార్మిక సహాకార సంఘం అధ్యక్షులు సంగెం మేఘనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో సాయంత్రం 5-05 గంటలకు మహా పడిపూజ కొ నసాగుతుందన్నారు. పూజ అనంతరం సాయంత్రం 6-45 గంటలకు మకర జ్యోతి దివ్య దర్శనం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా భక్తులకు ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి….

