విజేతలకు వీరహనుమాన్ కటాక్షం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

విజేతలకు వీరహనుమాన్ కటాక్షం..!
– లక్కీ డ్రా విన్నర్స్‌కు బైకు, స్కూటీ
– డ్రా తీసిన తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి
– బహుమతులు అందజేసిన నిర్వహకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వీర హనుమాన్ జన్మోత్సవ లక్కీ డ్రాలో స్వామి వారి కటాక్షంతో విజేతలు బహుమతులను పొందారు. హనుమాన్ జయంతి సందర్భంగా తాండూరు వీర హనుమాన్ జన్మోత్సవ మితి ఆధ్వర్యంలో లక్కీ డ్రా చేపట్టారు.

లక్కీ డ్రా కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై లక్కీ డ్రా తీశారు. సోమవారం తాండూరులోని హోండా షోరూంలో ఏర్పాటు చేసిన ఈ డ్రాలో తాండూరుకు చెందిన వ్యాపార వేత్త గుముడాల సుధాకర్ కు మొదటి బహుమతి హోండా యూనికాన్ బైక్, విష్ణు రాంజీ అనే వ్యక్తికి రెండో బహుమతి కింద యాక్టీవా స్కూటీ దక్కింది. తాండూరు స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ మిస్కిన్ శంకర్, పెద్దల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు.

అనంతరం హనుమాన్ జన్మోత్సవ సమితి సభ్యులు మాట్లాడుతూ తాండూరులో హనుమాన్ జయంతి సందర్భంగా చేపట్టిన శోభాయాత్ర, సామూహిక హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమాలను విజయవంతం చేయడం పట్ల అందరికి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ జన్మోత్సవ సమితి సభ్యులు ఎం. రజనీకాంత్, మహేష్ ఠాకూర్, పర్యాద రామకృష్ణ, పునీత్, భవానీ సింగ్, గురురాజ్, శ్రీనివాస్, ఆనంద్, శివకుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

‘టాలెంట్’ ఎక్స్‌లెంట్..!