బషీరాబాద్ బాలికలు భళా..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

బషీరాబాద్ బాలికలు భళా..!
– ఫస్ట్, సెకండ్, థర్ట్ టాపర్లు వాళ్లే
– అభినందిస్తున్న ఉపాధ్యాయులు, మేధావులు
బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో పదో తరగతి బాలికలు భళా అనిపించారు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మొదటి మూడు స్థానాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ టాపర్లుగా నిలవడం విశేషం.

బషీరాబాద్‌ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పి. భావన- 549/600ల మార్కులతో మొదటి టాపర్‌ గా నిలువగా సలేహా – 533/600ల మార్కులతో రెండో టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా బసీరాబాద్‌ కేబీజీవీకి చెందిన యు. నవనీత మూడో టాపర్‌గా నిలిచింది. మొత్తానికి పదో తరగతి ఫలితాల్లో బాలికలు ఉత్తమ ఫలితాలతో ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, మేధావులు వారిని అభినందించారు.

ఇది కూడా చదవండి….

గురుకులాల్లో మెరిసిన బాలికలు..!