ఆరోగ్య తులసీ..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

ఆరోగ్య తులసీ..!
– ఆకులలో ఔషధగుణాలు
– తింటే రోగ్యాలన్నీ పరార్
దర్శిని డెస్క్ : చలికాలంలో చల్లటి గాలి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ సీజన్‌లో ప్రజలు సాధారణంగా జలుబు, దగ్గు, రోగనిరోధక శక్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తులసి ఆకులను దినచర్యలో చేర్చుకుంటే.. ఆరోగ్యానికి వరమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. తులసిలోని ఔషధ గుణాల కారణంగా భారతీయ గృహాలలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. తులసి ఆకులను రోజూ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో తులసిని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో రోజూ నాలుగు తులసి ఆకులను నమిలి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి ఆకులలో విటమిన్ సి, జింక్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తులసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చలికాలంలో జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. దగ్గు నుంచి ఉపశమనం: తులసిని తీసుకోవడం వల్ల కఫం, శ్లేష్మం తగ్గుతాయి. ఇందులోని యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గును నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. తులసిని రోజూ తింటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. చలికాలంలో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో తులసిని తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

తులసిని సహజమైన యాంటీ డిప్రెసెంట్‌గా పరిగణిస్తారు. దీని ఉపయోగం చలికాలంలో సంభవించే కాలానుగుణ ప్రభావిత రుగ్మత లేదా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జుట్టుకు మంచిది: తులసిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ వ్యాధులను నివారిస్తాయి.

ఎలా తీసుకోవాలంటే…?
ఇంకా తులసిని తేనెతో కలిపి తీసుకుంటే దాని ప్రయోజనాలు పెరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నాలుగు తాజా తులసి ఆకులను కాచి టీలా తాగండి. తులసి ఆకులను నేరుగా కూడా నమిలి తినవచ్చు. వీటి వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు.

(నోట్‌: ఇందులోని పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

ఇది కూడా చదవండి….

చైనా మాంజాతో బాలుడికి గాయాలు