యువకుడికి కృత్రిమ పురుషాంగం..!
– హైదరాబాద్ వైద్యుల ఆపరేషన్ సక్సెస్
– తెలంగాణలో ఫస్ట్ టైం అన్న వైద్యులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : చిన్నతనంలో పురషాంగం కోల్పోయిన ఓ యువకుడికి హైదరాబాద్ వైద్యులు కృతిమ పురుషాంగాన్ని అమర్చారు. వైద్యుల ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఈ అపరేషన్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని ఇలాంటి అరుదైన ఆపరేషన్ ఫస్ట్ టైం విజయవంతం అయ్యిందని వైద్యులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే… సోమాలియాకు చెందిన ఓ యువకుడు చిన్నతనంలో అతనికి చేసిన సున్తీ వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో పురుషాంగాన్ని కోల్పోయాడు. అప్పట్లో మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఆ సమయంలో వృషణాల కింద నుంచి యూరిన్ పాస్ చేసే ఏర్పాటు చేశారు.
సంవత్సరన్నర ముందు జరిగిన సర్జరీ అనంతరం యువకుడు పూర్తిగా కోలుకున్నట్లు మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్, పాస్టిక్ సర్జర్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్‌లు వివరించారు. 2 ఫేజుల్లో జరిగిన ఈ చికిత్స సక్సెస్ అయిందన్నారు. 18 ఏళ్ల వయసు వచ్చేప్పటికి.. యూరిన్ పాస్ చేయడంలో సమస్య రావడంతో.. అతను మెడికవర్ ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు. దీంతో డాక్టర్లు యూరిన్ సాఫీగా పాస్ అయ్యేలా సర్జరీ చేశారు. తర్వాత పురుషాంగాన్ని పునఃసృష్టించి చేయాలని డిసైడయ్యారు. తొలుత అతడి పొట్ట, తొడ వద్దగల రక్తనాళాలు, మోచేతి వద్ద కండరాన్ని సేకరించి ల్యాబ్‌లో కృత్రిమంగా పురుషాంగాన్ని సృష్టించారు.
ఆ తర్వాత మైక్రోవాస్క్యులర్ సర్జరీ ద్వారా రేడియల్ ఆర్టెరీ ఫోర్‌ఆర్మ్ ఫ్లాప్ పద్దతిలో తొలుత యువకుడి ముంజేయి వద్ద పురుషాంగాన్ని రూపొందించారు. అనంతరం దానిని రక్తనాళాలకు కనెక్ట్ చేశారు. ప్రయోగం సక్సెస్ అవ్వడంతో ఏడాదిన్నర కిందట సర్జరీ చేసి దానిని వృషణాల పైభాగంలో దానిని అతికించారు. పురుషాంగం నుంచి యూరిన్ పాస్ చేసేలా గొట్టాన్ని అమర్చి… మూత్రాశయానికి కనెక్ట్ చేశారు. ఏడాదిన్నర తర్వాత.. యువకుడు స్పర్శ పొందడంతో అంగస్తంభన కోసం తాజాగా పిలైన్ ఇంప్లాంట్ చేసినట్లు డాక్టర్లు చెప్పారు. ఇప్పుడా యువకుడు మ్యారేజ్ చేసుకుని.. సంసారం జీవితం సాఫీగా గడపవచ్చని వెల్లడించారు. అయితే అప్పటి ఇన్‌ఫెక్షన్ కారణంగా వీర్యగ్రంథి డ్యామేజ్ అవ్వడంతో.. స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యే చాన్స్ లేదన్నారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఇదికూడా చదవండి…

