పిస్తా పోషకాల గని..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

పిస్తా పోషకాల గని..!
– శరీర కణాలు దెబ్బతినకుండా రక్షణ
– పేగు బ్యాక్టీరియాను తరిమే ఔషధాలు
– మరిన్ని అద్బుత ప్రయోజనాలు
దర్శిని డెస్క్ : పిస్తాపప్పులో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకములైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో అనేక రకములైన పోషకాలతో పాటు విటమిన్ బి6, ఫైబర్, పాస్పరస్, కాపర్, పొటాషియం ఉన్నాయి. ఇవి రక్తంలోని హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తాయి. పిస్తాపప్పులోని పోషక విలువలు ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు అవసరమైన పోషకాలను అందిస్తాయి. పిస్తా పప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులో జింక్‌ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ B6 రోగనిరోధక పనితీరుకు అవసరమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులోని సెలీనియం యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

కొన్ని ఆహారాలు వాతావరణాన్ని బట్టి మన శరీరానికి మేలు చేస్తాయి. ఈ ఆహారాలు మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అటువంటి వాటిల్లో పిస్తాపప్పు ఒకటి. పిస్తాపప్పు శీతాకాలంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిస్తాపప్పులోని పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు రోగనిరోధక కణాల కార్యకలాపాలను పెంచుతుంది. ఇందులోని ప్రీబయోటిక్ లక్షణాలు పేగులోని బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది శ్లేష్మ పొర రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

గుండెకు మేలు!
మోనోసాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పిస్తాల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు తోడ్పడతాయి. ఫలితంగా గుండె జబ్బులకు దూరంగా ఉండచ్చు.

బరువు నియంత్రణ!
కేలరీలు తక్కువగా ఉండే పిస్తాలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీర బరువు ఎప్పుడూ నియంత్రణలో ఉంటుంది. ఇందులోని ప్రొటీన్లు, ఫైబర్ కడుపు నిండుగా ఉన్నట్టుగా చేసి అధిక ఆకలిని, అదుపు లేకుండా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. తద్వారా కేలరీలు తక్కువ తీసుకుంటూ బరువు పెరగకుండా చేస్తుంది.

కంటి చూపు పదిలం!
కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడే లూటేన్, జియాంక్సితిన్, యాంటీ ఆక్సిడెంట్లు పిస్తాల్లో మెండుగా దొరుకుతాయి. ఇవి కంటిని నీలికాంతి నుంచి, వయసు సంబంధిత కంటి సమస్యల నుంచి కాపాడేందుకు, కంటి శుక్లాల ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి.

ఇదికూడా చదవండి…

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్…!