సీఎం క్యాండెంట్ ఎవరో..?
– కొనసాగుతున్న ఉత్కంఠ
– ఢిల్లీకి డీకే శివకుమార్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎంపికపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని విషయంలో ఎలాంటి డౌట్ లేకున్నప్పటికి కౌన్ బనేగా సీఎం అనే విషయంలో సస్పెన్స్ ఏర్పడింది. సోమవారం ఎల్లా హోటల్‌లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో సీఎల్పీ భేటీ జరిగింది. సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులుగా డీకే శివకుమార్‌తో పాటు దీప్‌దాస్ మున్షీ, జార్జ్, అజయ్, మురళీధరన్ హాజరయ్యారు. 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ సమావేశంలో పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సీఎం రేసులో ఉన్న వారితోనూ చర్చలు జరిపారు. అయితే, సీఎం పేరుపై కొలిక్కి రాలేదు.. సీఎం రేసులో ఉన్నవారు వెనక్కి తగ్గకపోవడంతో అబ్జర్వర్లు ఢిల్లీకి బయలుదేరారు. ఎల్లా హోటల్ నుంచి డీకే శివకుమార్ ఢిల్లీకి బయలుదేరారు. అబ్జర్వర్లు కూడా రేపు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆ తర్వాత సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేతో భేటీకానున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఎవరు అవుతారనే ఆసక్తిగా.. ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి…

