ఇందిరమ్మ ఇళ్లకు జియో ఫెన్షింగ్…!

టెక్నాలజీ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఇందిరమ్మ ఇళ్లకు జియో ఫెన్షింగ్…!
– అన్నీ సరిగ్గా ఉంటేనే రూ. 5లక్షల సాయం
– చూపించిన స్థలంలో లేకుంటే సాయం కట్‌
– ఎందుకు.. ఎలా అమలు చేస్తారంటే…?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంను వినియోగించబోతోంది. ఇందుకు కోసం ఏఐ ద్వారా ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లలో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. ఒక స్థలంలో చూపించి మరో స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడం, పాత ఇళ్లకే రంగులు వేసి కొత్తవిగా చూపించి బిల్లులు తీసుకోవడం, బేస్‌మెంట్‌ లెవల్‌లో మొదటి బిల్లు ఉపాధి నిధుల నుంచి కావడంతో అందినకాడికి దోచుకున్నారు.

అందుకే ప్రస్తుతం జియో ఫెన్సింగ్ విధానంను అమలు చేయబోతున్నారు. పేదలకు ప్రభుత్వ సాయంతో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లను తొలిసారి జియో ఫెన్సింగ్‌ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రతి నియోజకవర్గానికి 3500ల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి అక్రమాలు జరగకుడా జియో ఫెన్షింగ్ విధానంనుఇందిరమ్మ ఇళ్లతో అమల్లోకి తీసుకురానున్నారు. 2013లో రాష్ట్రంలో జియో ట్యాగింగ్‌ విధానాన్ని అమలు చేయడానికి అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించినా అమలు కాలేదు. ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం జియో ఫెన్సింగ్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది.

ఎలా అమలు చేస్తారంటే…?
మొదటి విడతలో సొంతంగా ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల సర్వే చేసిన అధికారులు సొంత స్థలం ఉన్న నిరుపేదలతో కూడిన ఎల్‌1 జాబితాను సిద్ధం చేశారు. ఇళ్లు కట్టే స్థలాన్ని సర్వే సమయంలోనే చూపించారు. ఇప్పుడా స్థలం జియో ఫెన్సింగ్‌ చేయనున్నారు. ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసే రోజు గ్రామ కార్యదర్శికి, వార్డు అధికారికి సమాచారం ఇవ్వాలి. సర్వేలో చూపిన స్థలం అదేనా కాదా అని వారు ధ్రువీకరించాలి. అనంతరం ప్రత్యేక యాప్‌లో స్థలం వివరాలు, అక్షాంశ, రేఖాంశాల వివరాలతో జియో ఫెన్సింగ్‌ చేస్తారు. తర్వాత నిర్మాణంలో ఉన్నప్పుడు తనిఖీకి వచ్చినప్పుడు ఆ స్థలం వద్ద నిల్చొని యాప్‌ ద్వారా పరిశీలిస్తారు. గతంలో ఇచ్చిన వివరాలు మ్యాచ్‌ అయితేనే ఫొటోలు, వివరాలు యాప్‌లో అప్‌లోడ్‌ అవుతాయి. ఏమాత్రం తప్పుడు సమాచారం ఉన్నా యాప్‌ తిరస్కరిస్తుంది.

ఇదికూడా చదవండి…

షబ్బాష్.. ఏజాజ్.. బాయ్..!