బ్రహ్మోత్సవాలలో ‘బావనోళ్ల’ భక్తజన సేవ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బ్రహ్మోత్సవాలలో ‘బావనోళ్ల’ భక్తజన సేవ..!
– శ్రీశైలంలో భక్తులకు అన్నదానం
– 8 ఏండ్లుగా శంకరన్న సేవా తత్పరత
– అభినందించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
– శంకర్ యాదవ్ ను సన్మానించిన విశ్వం పంతులు, మిత్రబృందం
– ఈనెల 22 వరకు అన్నదాన కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో తాండూరుకు చెందిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ భక్తజన సేవలో తరిస్తున్నారు. ప్రతి యేడాది మాదిరిగానే శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో బుధవారం నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. బావనోళ్ల శంకర్ యాదవ్ తన మిత్ర బృందం సహాకారంతో గత 8ఏండ్లుగా శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో అన్నదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సారి ప్రారంభించిన అన్నదాన కార్యక్రమంలో ప్రతి రోజూ 8 నుంచి 10వేల మందికి అన్నదానం చేస్తున్నారు. శ్రీశైలంలో బావనోళ్ల శంకర్ యాదవ్ చాటుకుంటున్న సేవా తత్పరతను స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అభినందించారు.

8ఏండ్లు అన్నదానం చేయడంలో చేస్తున్న కృషిని కొనియాడారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ పండితులు విశ్వం పంతులు శంకర్ యాదవ్ కు శివుని విగ్రహాన్ని బహుకరించి.. శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ విశ్వం పంతులు, శ్రీశైలం దేవాలయ అర్చకులు గంగాదర్, మిత్రబృందం, తాండూరు మండలం చెంగోల్ గ్రామ యువకులు, శివ్వ స్వాముల తోడ్పాటుతో శ్రీశైలంలో భక్తులకు అన్నదానం చేసే భాగ్యం దక్కిందన్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజూ 10వేల మందికి అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. ఈనెల 24వ తేది వరకు అన్నదానం కొనసాగించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ రాములు యాదవ్, మిత్రులు జొన్నల వినోద్ కుమార్, పట్లోళ్ల వేణు గోపాల్ రెడ్డి, మనోహర్ యాదవ్, తండ్రి బావనోళ్ల హస్మయ్య, కుమారులు అభినవ్ సాయి, బంటు మల్లప్ప, మాజీ ఎంపీటీసీ రాము, మేనల్లుడు అరవింద్ యాదవ్, మల్ రెడ్డి, శ్రీను, కిరణ్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, విఠల్, నర్సింలు గౌడ్, కళ్యాణం చందు. కల్వ ఉమాశంకర్, శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, పికే మల్లేశ్, వెంకటేష్, చెంగోల్ గోపాల్, రఘునాథ్ రెడ్డి, మహేందర్, అరుణ్ కుమార్, అనిల్, యాదయ్య, అంజి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

లింగస్థాపన ఉత్సవాలకు తోడ్పాటు