లింగస్థాపన ఉత్సవాలకు తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

లింగస్థాపన ఉత్సవాలకు తోడ్పాటు
– అందించేందుకు ముందుకొచ్చిన విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో నిర్వహించబోతున్న లింగస్థాపన ఉత్సవాలకు తన వంతు తోడ్పాటు అందించేందుకు తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ముందుకు వచ్చారు. గురువారం తాండూరు పట్టణంలోని వినాయక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉత్సవ నిర్వహకులు విఠల్ నాయక్ న్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 24న తాండూరు మండలంలోని చంద్రవంచ గ్రామంలో నిరుగుడి గురుహవా మల్లినాథ్ మహరాజ్ ఆధ్వర్యంలో లింగస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం విఠల్ నాయక్ మాట్లాడుతూ లింగస్థాపన ఉత్సవాలలో భక్తుల కోసం తన వంతు సాయంగా అన్నదానానికి తోడ్పాటు అందిస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వహకులు దర్మీది రవీశంకర్, భూదాత అగ్గనూర్ అశోక్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

పాపర్టీ ట్యాక్స్ క్లీయర్..!