అన్యాయంగా ఆర్టీసీ బస్సులోంచి దించేశారు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అన్యాయంగా ఆర్టీసీ బస్సులోంచి దించేశారు..!
– ఎండు మిర్చి బస్తాతో బస్సు ఎక్కిందని కండక్టర్ నిర్వాకం
– తరువాత భర్తతో కలిసి వచ్చిన మహిళను ఢీకోట్టిన ఆటో
– తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు, మెరుగైన వైద్యం చేయాలన్న డాక్టర్లు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికి తెలుసు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని ఆర్టీసీ అధికారులే చెబుతుంటారు. ఈ రెండు ప్రమాణాలు పాటించక పోవడంతో ఓ మహిళకు తీవ్ర నష్టం జరిగింది. ఎండు మిర్చి బస్తాతో బస్సు ఎక్కిన మహిళను ఆర్టీసీ బస్ కండక్టర్ బస్సులో నుంచి దించేశారు. భర్త సాయంతో తాండూరుకు చేరుకున్నా ఆమె రోడ్డు భర్తతో పాటు తీవ్రగాయాల పాలయ్యింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన తోపాజీ నర్సమ్మ బందువులతో కలిసి తాండూరు వచ్చేందుకు మంబాపూర్ వద్దకు వచ్చింది. అయితే తాండూరులో కారంపొడి కొట్టించుకునేందుకు ఎండు మిర్చి బస్తాను వెంట తెచ్చుకుంది. అదే సమయంలో వికారాబాద్ డీపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఎక్కింది. ఆమెకు మంబాపూర్ నుంచి తాండూరు వరకు వెళ్లేందుకు కండక్టర్ టిక్కెట్ ఇచ్చారు. కొద్ది సేపటికి ఎండు మిర్చి బస్తా నుంచి ఘాటు వస్తుందని కండక్టర్ నర్సమ్మను కొద్ది దూరం వెళ్లగానే బస్సులో నుంచి దించేశారు.

ఆమె కండక్టర్ తో వాదనకు దిగినప్పటికి అనుమతించలేదు. బస్సు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నర్సమ్మ భర్త చంద్రప్పకు ఫోన్ చేసింది. చంద్రప్ప నర్సమ్మ వద్దకు చేరుకుని ఇద్దరు కలిసి బైకుపై తాండూరుకు చేరుకున్నారు. తాండూరు పట్టణంలోకి రాగానే మెట్రో మనీలా అనే హోటల్ వద్ద వీరి బైకును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సమ్మకు కాలు విరిగింది. కన్నుకు, వీపు భాగంలో గాయాలయ్యాయి. భర్త చంద్రప్పకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బందువులు తాండూరు పట్టణంలోని బాలాజీ ఆసుపత్రిలో చేర్పించారు.

నర్సమ్మకు మెరుగైన వైద్యం చేయాలని వైద్యులు తెలిపినట్లు ఆవేధన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు కండక్టర్ బస్సు దించేయకుండా ఉంటే సురక్షితంగా చేరుకునేదని వాపోయారు. ఆర్టీసీ కండక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఇదికూడా చదవండి…

మహిళలకు ఏడాదికి రెండు చీరలు..!