దిగొస్తున్న‌ పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌లు

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

దిగొస్తున్న‌ పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌లు
– గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.200ల స‌బ్సీడీ
– ప్ర‌క‌టించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌
– వాహ‌న‌దారుల‌కు, వినియోగ దారుల‌కు భారీ ఊర‌ట‌
ద‌ర్శిని డెస్క్: దేశంలో పెట్రోల్‌, డీజీల్ దిగివ‌స్తున్నాయి. వాటితో పాటు గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ. 200ల రాయితీ క‌ల్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో దేశంలోని వాహనదారులకు, వినియోగ దారుల‌కు భారీ ఊరట దక్కింది. పెట్రోల్, డీజిలైపై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని గణనీయంగా తగ్గిస్తున్నట్లు . కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nimala Sitharaman) ప్రకటించారు. పెట్రోలైపై లీటరుకు రూ.8, డిజిల్ పై రూ.6 చొప్పున ఎక్సైడ సుంకాన్ని తగ్గించనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల లీటర్ పెట్రోల్ ధర 9.5 రూపాయల మర, డీజిల్ ధర 7 రూపాయల మేర తగ్గనుంది. అంతేకాకుండా డొమెస్టిక్ గ్యాస్ బండపై కూడా సబ్సిడీని పెంచింది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్లపై రూ. 200 చొప్పున సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా సుమారు రూ. 6100 కోట్లు రెవెన్యూ నష్టం వస్తుందన్నారు. అదేవిధంగా ఇనుము, స్టీల్ ఉత్పత్తుల ధరలు తగ్గించేందుకు ముడి సామగ్రిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు చెప్పారు. సిమెంట్ ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దిగుమతులపై అధికంగా ఆధారపడే ప్లాస్టిక్ ఉత్పత్తుల ముడి పదార్థాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పెట్రో బాదుడు కారణంగా బస్సు ఛార్జీలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వారికి ఊరటనిచ్చింది.. దీని ద్వారా తయారీ ఖర్చు తగ్గుతుందన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం ప్రతిఏటా దాదాపు లక్ష కోట్ల ఆదాయం కోల్పోతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.