వైభోగంగా రుక్మిణీ, విఠల్ కళ్యాణం
– ఘనంగా శ్రీ పాండురంగా దేవాలయ వార్షికోత్సవం
– దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్ మల్రెడ్డిపల్లి రోడ్డు మార్గంలోని శ్రీ పాండురంగా స్వామి దేవాలయంలో కొలువుదీరిన శ్రీ రుక్మిణీ విఠల్ కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శనివారం పాండురంగా స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో రోజంతా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆలయ ధర్మకర్త మేడిశెట్టి జగన్నాథం ఆద్వర్యంలో వేదపండితులు సుమూహుర్తములో శ్రీ రుక్మిణీ విఠల్ కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరిపించారు.

ఆలయ వార్షికోత్సవం, రుక్మీణీ-విఠల్ కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దేవాలయానికి హాజరై రుక్మీణీ విఠల్ సమేత స్వామి వార్లను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సాహు శ్రీలత లక్ష్మీకాంత్, పలువురు నేతలు న్నారు. అదేవిధంగా ఈ వార్షికోత్సవ వేడుకలలో పలువురు నేతలు, ప్రముఖులు ఆలయాన్ని సందర్శించి స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాండురంగా దేవాలయ భక్త బృందం, గాయత్రి మహిళ భక్త బృందం, మల్ రెడ్డిపల్లి భజనమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

