ఈటెల హత్యకు కుట్ర..!

జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

ఈటెల హత్యకు కుట్ర..!
– ప్లాన్ చేసిన కౌషిక్‌ రెడ్డి
– మాకేం జరిగిన కేసీఆర్‌దే బాధ్యత
– రాజేందర్ సతీమణి జమున
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఈటెల సతీమణి జమున ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జమున మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ద్వారా తన భర్త ఈటెల రాజేందర్ ను చంపేందుకు ప్లాన్ చేశారని అన్నారు. ఇందుకు ముందుగా రూ. 20 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు తెలిసిందన్నారు. కౌశిక్‌ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్‌ ఉన్నారని అన్నారు. కౌశిక్‌ రెడ్డిని.. కేసీఆర్‌ హుజూరాబాద్‌ ప్రజలపైకి ఉసిగొల్పారని, దీంతో ఆయన హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అమరవీరుల స్తూపాన్ని కౌశిక్‌రెడ్డి కూలగొట్టించారన్నారు. మా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా దానికి కేసీఆరే కారణమని జమున ఆరోపించారు. ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్తారు. బీజేపీలో ఈటెల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారని అనడం తప్పుడు ప్రచారం అని..ఆయన పార్టీలో సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీ మారను అంటూ ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయితే, తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని అన్నారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage