పేదల ఆరోగ్యానికి సర్కారు ప్రాధాన్యం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– 77 మందికి రూ.33లక్షల విలువైన చెక్కుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు నియోజవర్గంలోని తాండూరు పట్టణం, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండలాలకు చెందిన 77 మందికి మంజూరైన్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. మొత్తం రూ. 33లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకంతో ఆర్థిక భరోసా అందిస్తుందన్నారు. ఆపదలో ఉన్న పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోల్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు అజయ్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, జుబేర్ లాల, బోంబీనా, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

