శ్రీ సాయి మేధలో ఘనంగా హోలీ వేడుకలు
– ఆటపాటలతో విద్యార్థుల సందడి
– రంగుల మయమైన వాతావరణం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీచౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ప్రాంగణంలో చిన్నా పెద్ద తేడా లేకుండా హోలి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. రంగులు పూసుకొని కేరింతలు కొట్టారు.

విద్యార్థులు డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. కరస్పాండెంట్ పెరుమళ్ల వెంకట్ రెడ్డి హోలీ సంబురాల్లో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఉత్సాహం నింపారు. విద్యార్థులు ఉపాధ్యాయులు రంగులు పూసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగలోని రంగుల వలే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందోత్సవంతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

