బీఆర్ఎస్ తోనే సంక్షేమ పథకాలు
– అర్హులందరికి అమలు చేసిన ఘతన కేసీఆర్‌దే
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహీంద్ర సంఘం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ సర్కారుతో పేదలకు సంక్షేమ పథకాలు అందాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం సల్లా గార్డెన్ లో మహీంద్ర (మేదరి) సంఘం సభ్యులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో పలువురు సంఘం సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్’కే దక్కుతుందన్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్, బీసీ బంధు, గృహలక్ష్మీ వంటి తదితర పథకాలు అర్హులైన పేదలందరికి అమలు చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రూ. 1600 కోట్లతి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో సంఘం సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తల్లి, జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి, కౌన్సిలర్ రాము, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

