వేరీ ఫాస్ట్‌గా పాన్ కార్డ్..!
– కేవలం 10 నిమిషాల్లోనే పొందొచ్చు
– పేపర్లు, డాక్యుమెంట్లు లేకుండా, ఫీజు లేకుండా ఆప్లైకి చాన్స్
– ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకోండి..
దర్శిని ప్రతినిధి : ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు ఎంత అవసరమో.. అందరికి తెలిసిందే. అకౌంట్ తీయాలన్నా, రూ.50వేలకుపైగా లావాదేవీలు చేయాలన్నా పాన్‌కార్డు తప్పనిసరి కావాల్సిందే. గతంలో పాన్ కార్డు అప్లై చేసుకుంటే చేతికందేంందుకు సమయం పట్టేది. మారిన సాంకేతికతో ఇప్పుడు 10 నిమిషాల్లోనే పాన్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో అందుకోవచ్చు. పాన్ కార్డు దరఖాస్తు దారుల కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ “ఇన్‌స్టంట్ ఇ-పాన్” (Instant e-PAN) సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా, డాక్యుమెంట్లు అవసరం లేకుండా, అసలు ఫీజే లేకుండా చాలా తక్కువ సమయంలో పాన్ కార్డు పొందవచ్చు. దానికోసం ఈ సింపుల్ ట్రిక్స్ పాటించాలి.

దరఖాస్తు చేయడం ఎలా?
ముందుగా ఆన్‌లైన్‌లో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in కి వెళ్లాలి. హోమ్‌పేజీలో ‘క్విక్ లింక్స్’ (Quick Links) సెక్షన్ కనిపిస్తుంది. అందులో ‘ఇన్‌స్టంట్ ఇ-పాన్’ (Instant e-PAN) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. “గెట్ న్యూ e-PAN”. ఇది కొత్త పాన్ కోసం అప్లై చేయడానికి. రెండోది ‘చెక్ స్టేటస్/డౌన్‌లోడ్ PAN’, ఇది దరఖాస్తు చేసిన పాన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి. ఇదివరకే జారీ చేసిన పాన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి పనికొస్తుంది. కొత్త పాన్ కోసం దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి “గెట్ న్యూ e-PAN” (Get New e-PAN)పై క్లిక్ చేయాలి. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను టైప్ చేసి, ‘టర్మ్స్ సౌండ్ కండిషన్స్’ బాక్స్‌ను టిక్ చేసి ‘కంటిన్యూ’పై క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి ‘కంటిన్యూ’పై నొక్కాలి. వెబ్‌సైట్ మీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఫోటో ఆధార్ నుంచి ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది.

ఆ వివరాలను సరి చూసుకొని కంటిన్యూ’పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా అడగవచ్చు. ఇది తప్పనిసరి కాదని గుర్తించుకోండి. మీ ఇష్టం వస్తే ఇవ్వచ్చు.. ఇవ్వకపోవచ్చు. ఆ తర్వాత ఇ-పాన్ జనరేట్ అవుతుంది. వెరిఫికేషన్ సక్సెస్ అయితే, ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది. కొన్ని నిమిషాల్లో ఇ-పాన్ సిద్దమైపోతుంది. ఇది రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు పంపిస్తారు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటుంది.
డౌన్‌లోడ్ చేయడం ఈజీ..
ఇ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మళ్లీ Instant e-PAN సెక్షన్‌కి వెళ్లి చెక్ స్టేటస్/ డౌన్‌లోడ్ PANపై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్, OTP ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత, ఇ-పాన్‌ను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్‌లోడ్ అయ్యేందుకు కేవలం పది నిమిషాలు పడుతుంది. ఈ తక్కువ సమయంలోనే మీరు పాన్‌కార్డును పొందవచ్చు.
ఇదికూడా చదవండి…

