మునుగోడు పట్టం బీజేపీకే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మునుగోడు పట్టం బీజేపీకే..!
– భారీగా మద్దతు ఇస్తున్న ప్రజలు
– వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మునుగోడు ఉప ఎన్నికల్లో స్థానిక ప్రజలు బీజేపీకే పట్టం కట్టబోతున్నారని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ అన్నారు. శనివారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహల్లాదరావుతో కలిసి యు. రమేష్ కుమార్ శివన్న గూడలో ప్రచారం నిర్వహించారు. ఈవీఎం మిషన్లతో ఓటర్ల వద్దకు వెళ్లి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటు చేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా యు. రమేష్ కుమార్ మాట్లాడుతూ మునుగోడు ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారని, ఉప ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టబోతున్నారని అన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. మరోవైపు సంస్థాన్ నారాయణ పూర్, చండూరులో జరిగిన నగర సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను యు. రమేష్ కుమార్ కలిసి సన్మానించారు. భగీరథ వంశస్తులైన, శ్రీరాముని వారసులైన సగరులు బీజేపీకి పూర్తి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హన్మంతు ముదిరాజ్, యువ మోర్చ నాయకులు కిరణ్ ముదిరాజ్, రమేష్, సగర, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.