మళ్లీ..చిలుక వాగు సర్వే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మళ్లీ..చిలుక వాగు సర్వే..!
– సర్వే నెంబర్లలో వాగు హద్దుల ఆరా
– మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వివాదాస్పాదంగా మారిన చిలుక వాగుపై పలు శాఖల అధికారులు మళ్లీ సర్వే నిర్వహించారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గం నుంచి సాయిపూర్ మీదుగా యాలాల మండలం కోకట్ శివారులో ఉన్న సర్వేనెంబర్లు 36, 39, 41, 47, 48, 52, 53, 57, 58, 59, 62, 63లలో చిలుక వాగు ప్రవాహం ఉన్నట్లు గతంలోనే అధికారులు నక్ష ఆధారంగా నిర్ధారించారు.

తాండూరు కాగ్నానదిలో కలుషిత జలాలు కలుస్తున్నట్లు గ్రీన్ ట్రిబ్యూనల్ కోర్టులో కేసు కొనసాగుతోంది. ఇందులో చిలుక వాగు ప్రమేయం ఎంత అనే దానితో పాటు వాగు సర్వేకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు శుక్రవారం తాండూరు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చిలుక వాగు సర్వే చేపట్టారు. గతంలో వాగు పూర్వపు ప్రవాహం ఎలా విధంగా ఉందో అదే మార్గంలో ఆయా శాఖల సిబ్బంది సర్వే చేశారు.

వాగు ప్రవాహ మార్గంలో భవనాలు, వెంచర్లు ఏమేం ఉన్నాయో అన్ని గుర్తించారు. ఈ నివేధికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్, ఇరిగేషన్ డీఈ కిష్టయ్య, ఆరి, సర్వేయర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఫస్ట్ డే.. నో’టెన్‌’షన్..!