ఇక పేదలకు సన్న బియ్యం..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఇక పేదలకు సన్న బియ్యం..!
– దొడ్డు బియ్యంకు బదులుగా పంపిణీ
– లాంచనం తరువాత కంట్యూన్యూ
– నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని పేదలకు కాంగ్రెస్ సర్కారు ఉగాది కానుక అందించనుంది. పండగ తరువాత నుంచి అర్హులైన ప్రతి లబ్దిదారునికి రేషన్ కోటా కింద సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ప్రజా పంపిణీ అందించిన దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులు తినలేకపోయారని, ఆ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, రీసైక్లింగ్ జరుగుతుండేది. సన్నబియ్యం ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తమ ప్రభుత్వం ఆహార భద్రతలో భాగంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకాన్ని అమలు చేయనుందని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు. హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారు.

ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.95 లక్షల రేషన్ కార్డులుండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వచ్చే ఏప్రిల్ నెల నుంచి నెలకు ఆరు కేజీల సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పథకంతో రాష్ట్రంలోని సుమారు 84 శాతం మంది ప్రజలు లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి…

గుమ్మడి గింజల్లో ఆరోగ్యం..!