బోనమ్మను దర్శించుకున్న కాంగ్రెస్ నేతలు

తాండూరు రాజకీయం వికారాబాద్

బోనమ్మను దర్శించుకున్న కాంగ్రెస్ నేతలు
– పూజలు నిర్వహించిన ప్రభాకర్ గౌడ్
– సన్మానించిన ఆలయ కమిటి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో వెలసిన శ్రీ బోనమ్మ అమ్మవారిని తాండూరు కాంగ్రెస్ నేతలు దర్శించుకున్నారు. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం బోనమ్మ ఆలయాన్ని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ సందర్శించారు. పార్టీ నాయకులతో కలిసి ఆలయంలో వెలసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటి సభ్యులు అమ్మవారిని దర్శించుకున్న ప్రభాకర్‌ గౌడ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ తాండూరు ప్రజలు సుభిక్షంగా ఉండేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అమ్మవారి దయతో అందరు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారా అశోక్, సురేష్, నర్సింహా నాయి, మిర్చి వెంకట్, చెంద్రశేఖర్, బోనమ్మ గుడి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.