బీసీ ఉద్యమాన్ని ప్రతి గడపకు చేర్చాలి
– సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– బషీరాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్ నియామకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సామాజిక ఉద్యమాన్ని ప్రతి గడపకు చేర్చేలా పనిచేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బషీరాబాద్ మండల బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా సోమిశెట్టి జగదీశ్వర్, యూత్ ప్రెసిడెంట్ గా సిద్దార్థ గౌడ్ లను నియమించారు.

బుధవారం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మండల అధ్యక్షులు నరేందర్ చేతుల మీదుగా వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్.కృష్ణయ్య ప్రారంభించిన సామాజిక ఉద్యమాన్ని ప్రతి గడపకు చేరే విధంగా పనిచేయాలన్నారు. బహుజన వర్గాలలో రాజ్యాధికారం చేపట్టేలా స్ఫూర్తిని నింపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ్ చారి, బషీరాబాద్ మహిళ అధ్యక్షులు వీరమణి, దేవనూర్ మాజీ సర్పంచ్ శివకుమార్, గోనూరు రాములు, అరుణ్ రాజ్, చల్లా హరి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

