అమృత్ 2.0 నిధులతో మహర్ధశ..!
– తాండూరుకు రూ. 27 కోట్ల మంజూరు హర్షణీయం
– సంతోషం వ్యక్తం చేసిన బీజేపీ కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 నిధులతో తాండూరుకు మహర్ధశ రాబోతుందని మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత లక్ష్మీకాంత్, బంటారం లావణ్య, పూజ రజనీకాంత్, మల్లప్పలు అన్నారు. తాండూరు మున్సిపల్‌కు అమృత్ 2.0 కింద రూ. 27 కోట్లు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోనే అభివద్ధి జరుగుతోందన్నారు.
2020 సంవత్సరం నుంచి 2025 వరకు మున్సిపల్ పరిధిలో దాదాపు జరిగిన పనులన్నీ కూడా 60 శాతంపైగా పనులన్నీ కూడా 14 మరియు 15 ఫైనాన్స్ ద్వారానే పనులను చేపట్టడం జరిగిందన్నారు. తాజాగా అమృత్ 2.0 ద్వారా 27 కోట్ల నిధులను తాండూర్ మున్సిపాలిటీకి మంజూరు కావడం హర్షణీయమన్నారు. అదేవిధంగా చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తాండూరులో కంది బోర్డ్ లేదా కందికి మద్దతు ధర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుని, అత్యధిక నిధులతో తాండూరును అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ ఉన్నారు.
ఇదికూడా చదవండి…

